ఆ జాతరలో అదే ఆచారం.. ముద్దులు పెడుతూ డాన్స్  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ జాతరలో అదే ఆచారం.. ముద్దులు పెడుతూ డాన్స్ 

February 29, 2020

Karnataka

జాతర అంటే ఏముంటుంది బొమ్మలు, రంగులరాట్నం, మిఠాయిలు, సర్కస్, డప్పులు, మొక్కు ఇలా చాలా హంగామా ఉంటుంది. కానీ ఓ జాతరలో ఇవన్నీ ఓ ఎత్తు అయితే అక్కడ ముద్దులు మరో ఎత్తు. ఏంటీ ముద్దులా అని ఆశ్చర్యపోకండి. ఆ జాతరలో ఆ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భార్యాభర్తలు కలిసి ఆ జాతరకు వెళ్లి పబ్లిక్‌లో బిడియం లేకుండా చక్కా ముద్దులు పెట్టుకోవాలి. ఈ వింత జాతర కర్ణాటకలోని బళ్లారి జిల్లా, దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి  గ్రామంలో జరుగుతుంది. పదేళ్లకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఆ జాతరలో భార్యాభర్తలు కలిసి పాల్గొంటారు. జాతరలో సదరు భార్యాభర్తలు పబ్లిక్‌లో డాన్స్‌ చేయాలి. అంతేకాదు అలా డాన్స్‌ చేస్తూ ముద్దులు పెట్టుకోవాలి. జాతరలో దంపతులు అలా ముద్దులు పెట్టుకోవటం ఆచారంగా కొనసాగుతోంది. 

ఈ జాతరకు ఉన్న మరొక విశేషం ఏంటంటే.. వయసుతో సంబంధం లేకుండా యువకులు, మధ్య వయస్సువారు, వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అందరూ తమతమ జంటలతో డాన్స్ చేస్తూ గాఢ చుంబనాలు చేస్తారు. ఇది చూస్తే ఎవరికైనా పాశ్చాత్య నాగరికతలా అనిపిస్తుంది కానీ.. ఇది పక్కా మన దేశీ ఆచారం అన్నమాట. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గ్రామస్థులు ఆచార, సాంప్రదాయాలతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భార్యాభర్తలు డాన్స్ చేస్తూ ముద్దులు పెట్టుకున్నారు. గ్రామదేవత ఊరమ్మ దేవికి ఈ జాతరను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ వింత సాంప్రదాయాన్ని పాటిస్తేనే  అమ్మవారు సంతృప్తి చెందుతారని స్థానికులు విశ్వసిస్తారు. జాతర ప్రారంభంలో అమ్మవారికి అలంకరణలు చేసి.. తరువాత విశేష పూజలు చేస్తామని, అనంతరం అనాదిగా వస్తున్న ఈ నృత్యాన్ని చేస్తామని జాతరకు వచ్చే భక్తులు చెబుతున్నారు.