Kitchen ingredients helps to treat dark elbows
mictv telugu

మోచేతులు.. మోకాళ్లు నల్లగా మారాయా?

November 23, 2022

Kitchen ingredients helps to treat dark elbows

మోచేతులు, మోకాళ్లు, చంకల్లో నల్లదనం ఎక్కువగా వుందా? కొంతమందికి మిగతా అంతా భాగానే ఉండి.. ఈ ప్రాంతాల్లో మాత్రం నలుపు మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ చిట్కాలు..
స్లీవ్లెస్, చిన్న డ్రెస్ లు వేసుకోవడానికి కొందరు జంకుతుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నలుపుదనం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. మిగతా శరీరం మీద కేర్ తీసుకున్నట్లే వాటి మీద కూడా తీసుకోవాలి. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ నలుపుదనాన్ని మాయం చేయవచ్చు.

_ ఆలుగడ్డలు పిగ్మేంటేషన్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లీచింగ్లా పని చేస్తాయి. ఆలుగడ్డను రెండు ముక్కలుగా కోసి వాటిని చంకలో, మోచేతులు, మోకాళ్ల వద్ద పది నిమిషాలు రుద్దాలి. కనీసం పది నిమిషాలు అలాగే వదిలేసి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

_ మృతకణాలు తొలగించడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. రెండు టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాలో.. పాలు లేదా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రాంతాల్లో రాసి ఆరేవరకు ఉంచాలి. ఆ తర్వాత మామూలు నీళ్లతో కడిగిస్తే సరిపోతుంది.

_ చర్మం రంగు మారడానికి కీరదోస సహాయం చేస్తుంది. బ్లీచింగ్ ఏజెంట్గా కూడా కీరదోసను ఉపయోగించొచ్చు. కీరదోస్ను పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసి చంకల్లో, మోచేతులు, మోకాళ్ల వద్ద రాసి పది నిమిషాలు ఆరనిచ్చి.. ఆ తర్వాత కడిగేయాలి.

_ నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి నేరుగా ఒక ముక్కను నల్లదనం ఉన్న ప్రాంతాల్లో రుద్దొచ్చు. ఇలా కాకుండా.. నిమ్మకాయ ముక్కకు కొంత చక్కెర అద్ది కూడా ఇలా చేయొచ్చు. చక్కెరను వాడడం వల్ల చర్మం మీద మృతకణాలు కూడా తొలగిపోతాయి.

_ ఆపిల్ సైడర్ వెనిగర్.. ఇందులో అసిడిక్ మూలాలుంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్లో.. రెండు టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసుకోవాలి. కాటన్ బాల్ తీసుకొని నల్లగా ఉన్న ప్రాంతాల్లో నెమ్మదిగా రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేస్తే నల్లదనం చాలా వరకు తగ్గుతుంది.