Kithakithalu’ heroine Geetha Singh son died in an accident
mictv telugu

Geetha Singh: టాలీవుడ్‎లో విషాదం..ప్రముఖ కమెడియన్ కుమారుడు మృతి

February 18, 2023

Kithakithalu’ heroine Geetha Singh son died in an accident

ప్రముఖ లేడీ కమెడియన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.”దయచేసి కారు, బైక్‌లో పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మరణించారు” అని ట్వీట్ చేశారు.

గీతాసింగ్‎కు ఇంకా పెళ్లి కాలేదు. తన అన్న చనిపోవడంతో ఇద్దరు పిల్లలను ఆమె పెంచుకుంటున్నారు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు తన కజిన్ కూతురిని కూడా సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. వీరిలో పెద్దకుమారుడు శుక్రవారం సాయంత్రం తన స్నేహితులతో కారులో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఈప్రమాదంలో అతను అక్కడిక్కడే మరణించినట్టు తెలుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది లేడి కమెడియన్స్ లో గీతాసింగ్ ఒకరు. ‘ఎవడిగోల వాడిది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతాసింగ్.. అల్లరి నరేష్ సరసన ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. తర్వాత అడపదడపా ఓ 50 సినిమాల వరకు నటించినా..క్రమంగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.