కోహ్లీ సేన ఘన విజయం.. ఏకంగా రెండో ప్లేస్‌లోకి - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ సేన ఘన విజయం.. ఏకంగా రెండో ప్లేస్‌లోకి

October 22, 2020

nhnghn

ఈ సీజన్ ఐపీఎల్‌లో కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబి జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గత సీజన్లలో చెత్త ప్రదర్శనతో ఎన్నో అమమనాలను ఎదురుకున్న సంగతి తెల్సిందే. కానీ, ఈ ఏడాది సమిష్టి కృషితో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన 10 లీగ్ మ్యాచ్‌ల్లో 7 మ్యాచుల్లో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. నిన్న కోల్కతతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘనవిజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా.. బెంగళూరు బౌలర్ల తాకిడి తట్టుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసాడు. ఇక 85 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు కేవలం 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు దేవదత్, ఆరోన్ ఫించ్‌లు దూకుడుగా ఆడారు. దేవదత్ 25, ఫించ్ 16 పరుగులు చేయగా, గుర్మీత్ సింగ్ 21, విరాట్ కోహ్లీ 18 పరుగులు చేశారు.