సెలబ్రిటీల పెండ్లి అంటేనే అంగరంగవైభవంగా జరుగుతుంది. అతియా, కె.ఎల్.రాహుల్ పెండ్లి కూడా అలాగే జరిగింది. ఇప్పుడు వారు వేసుకున్న బట్టల గురించే అభిమానగణమంతా చర్చ చేస్తున్నారు.
నవ వధువు అతియా పెస్టల్ కలర్ లెహంగాతో చూపరులను ఆకట్టుకుంది. కె.ఎల్.రాహుల్ క్రీమ్ కలర్ షేర్వాణీతో స్టైలిష్ గా కనిపించాడు. వీరే కాదు.. సునీల్ శెట్టి, అతియా తమ్ముడు అహాన్ కూడా సంప్రదాయ పద్ధతిలో రెడీ అయి అందరినీ ఆహ్వానించారు.
కె.ఎల్.రాహుల్, అతియా శెట్టి.. జనవరి 23న సునీల్ శెట్టి ఖండాలా ఫామ్ హౌస్లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. వివాహ ఫోటోలు వైరల్ కావడంతో.. వారి కలలు కనే సెలబ్రిటీల దుస్తుల గురించి చర్చించుకుంటున్నారు. వారి డ్రెస్ లను అనామిక ఖన్నా డిజైన్ చేశారు. ఆమె అతియా కోసం డిజైన్ చేసిన డ్రెస్ మాత్రం ఆమె దృఢమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా డిజైన్ చేసిందని చెప్పింది.
లేత గులాబీ రంగు చికంకారీ లెహంగా అతియా పై అద్భుతంగా కనిపిస్తున్నది. అయితే ఇది ఆమె వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేలా డిజైన్ చేసినట్టు అనామిక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా అభివృద్ధి చేయాలనకున్నాను. ఆమె చాలా బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది. అది కచ్చితంగా ఆ డ్రెస్ లో ప్రతిబింబించాలనుకున్నా. ఆమె ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉంది’ అంటూ చెప్పింది. అనామిక ఖన్నా అతియా దుస్తులకు సిల్క్, దుపట్టాకు ఆర్గంజా సిల్క్ ను ఉపయోగించింది. దీని మీద పూల డిజైన్ ఎంబ్రాయిడరీ చేయించారు. దీనికి మ్యాచింగ్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ తో జతచేశారు. భారీ రాళ్లతో నిండిన చోకర్ అతియా అందాన్ని రెట్టింపు చేసింది.
అతియా, రాహుల్ 2019లో డేటింగ్ ప్రారంభించారు. అదే సంవత్సరం వారు తమ అనుబంధాన్ని ఇన్ స్టా ద్వారా అధికారికం చేశారు. 2020న కలిసి థాయ్ లాండ్ లో రింగ్ సెర్మనీ కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా ఫోటోలను పంచుకున్నారు. అతియా రాహుల్ తో కలిసి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లింది. రాహుల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్టాండ్ లో ఉత్సాహపరుస్తూ కనిపించేది. మొత్తానికి రెండు సంవత్సరాల తర్వాత వివాహ బంధం వారు ఒక్కటయ్యారు.