KL Rahul, Athiya shetti Wedding date fix
mictv telugu

టీం ఇండియా స్టార్ క్రికెటర్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్..

January 12, 2023

KL Rahul, Athiya shetti Wedding date fix

టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు కావడానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 23న కేఎల్ రాహుల్- అతియా శెట్టి ఒకటి కానున్నారు. మూడు రోజులు పాటు అంటే 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఘనంగా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే వీరి వివాహం జరగాల్సి ఉండగా టీం ఇండియా బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కొత్త సంవత్సరం మొదటి వారంలోనే కేఎల్ రాహుల్- అతియా శెట్టి పెళ్లి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అది జరగలేదు. చివరికి ఈనెల 23న ఖండాలాలో వివాహానికి ఏర్పాట్లు ప్రారంభించార.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెైనా అతియా 2015లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ‘హీరో’ చిత్రంతో అతియా 2015లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేఎల్ రాహుల్, అతియా మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచి తర్వాత బయటపడ్డారు. ప్రస్తుతం ఒక్కటవుతున్నారు. ఈ జోడీకి దక్షిణ భారత సంప్రదాయంలో వివాహం జరగనుంది. సునీల్ శెట్టి మంగళూరుకు చెందినవాడు కాగా..రాహుల్ కూడా మంగళూరు కుటుంబానికి చెందినవాడు కావడంతో పెళ్లిని దక్షిణ భారత సంప్రదాయంలోనే జరిపించనున్నారు.సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు సినీ, క్రీడా ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని, అతిథుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది.