భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. ఆ సమయంలో తనదైన శైలి బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను నెలగొల్పారు. ఇప్పడు సచిన్ సృష్టించిన రికార్డులు ఒక్కక్కటిగా బ్రేక్ అవుతున్నాయి. ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. సచిన్ ఎనిమిదేళ్ల రికార్డును బ్రేక్ చేసాడు.
సచిన్ 2012లో ఐపీఎల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. దానిని పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తాజాగా బ్రేక్ చేసాడు. ఐపీఎల్లో మొత్తం 63 ఇన్నింగ్స్‌లలో సచిన్ 2000 పరుగుల మార్క్ అందుకున్నాడు. కేఎల్ రాహుల్ మాత్రం కేవలం 59 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం పంజాబ్ జట్టు ఒక విక్కెట్ కోల్పోయి 12 ఓవర్లలో 96 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 61 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు.