నటితో పీకల్లోతు ప్రేమలో రాహుల్.. స్పష్టంగా చెప్పలేక.. - MicTv.in - Telugu News
mictv telugu

నటితో పీకల్లోతు ప్రేమలో రాహుల్.. స్పష్టంగా చెప్పలేక..

August 19, 2019

KL Rahul breaks silence on his alleged

కర్ణాటక యువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పంజాబీ మోడల్‌, నటి ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. వారిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలు మీడియాలోను తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరి బంధంపై రకరకాల కథనాలు వచ్చాయి. దీనిపై ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఒక సందర్భంలో ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌కు రాహుల్‌ను ఆకాంక్ష స్వయంగా పరిచయం చేసింది. దీంతో నెటిజన్లు వారిపై వస్తున్నవి పుకార్లు కాదు నిజమే అన్న నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెతో అనుబంధంపై రాహుల్ స్పందించాడు.

‘నేను నిజంగా పేపర్లు చదవను. అయినా ఇవన్నీ దేని గురించి రాశారు? నా గురించి ఏం రాశారో నాకు అస్సలు తెలియదు. నా వ్యక్తిగత విషయాలను నేను నాతోనే వుంచుకుంటాను. ఇతరులతో చర్చించను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా క్రికెట్‌ పైనే’ అని రాహుల్‌ ఓ మీడియా సంస్థకు వెల్లడించాడట. మరి మీరు ఒంటరా? కాదా? అన్న ప్రశ్నకు రాహుల్ నీళ్లు నమిలాడట. ‘నిజంగా నాకైతే తెలియదు. ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను’ అని రాహుల్‌ సమాధానం ఇచ్చాడు. కాగా, క్రికెటర్లతో సినిమా తారల అనుబంధానికి రాహుల్ కొత్తేమీ కాదు. టైగర్ పటౌడీతో మొదలు పెడితే విరాట్ కోహ్లీ వరకు సినీ తారలను పెళ్లి చేసుకున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ కరీబియన్‌ దీవుల్లో పర్యటిస్తున్నాడు.