kl rahul super Fielding
mictv telugu

మ్యాచ్‌ను మలుపుతిప్పిన రాహుల్ సూపర్ ఫీల్డింగ్

November 3, 2022

టీ20 ప్రపంచకప్ 2022లో బంగ్లా మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సూపర్ విక్టరీ కొట్టి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సూపర్ బౌలింగ్‌తో ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు లిటన్ దాస్, నజ్ముల్ షాంటో అదరిపోయే శుభారంభం అందించారు. ఈ సారి ఓపెనర్‌గా వచ్చిన లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.భారత్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో వర్షం అంతరాయం కలిగించింది..వర్షం తగ్గాక తిరిగి మ్యాచ్ ను ప్రారంభించి 16 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 151పరుగులుగానిర్ణయించారు.ఆట పున:ప్రారంభమైన తర్వాత తొలి ఓవర్‌లోనే డేంజరస్ లిటన్ దాస్(60) రనౌటయ్యాడు. ఈ వికెటే మ్యాచ్ ను మలుపుతిప్పింది.

కేఎల్ రాహుల్ సూపర్ ఫీల్డింగ్‌కు అతను వెనుదిరిగాడు.రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా లిటన్ దాస్ కొట్టాడు. రెండో రన్ కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి క్రీజ్‌కు చేరుకునే లోపే కేఎల్ రాహుల్ విసిరిన డైరెక్ట్ థ్రో- వికెట్లను గిరాటేసింది. రనౌట్ నుంచి కాపాడుకోవడానికి లిట్టన్ డైవ్ కొట్టినా ఉపయోగం లేకుండా పోయింది.