లక్నో టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20లో భారత్ తరపున కొత్త రికార్డును నమోదు చేశాడు. టీ20లో తక్కువ ఇన్నింగ్స్‌లో ఆరువేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచాడు. 166 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఈ ఘనత సాధించగా, ఈ క్రమంలో కోహ్లీ 184 ఇన్నింగ్స్‌ని అధిగమించాడు. ఇంతేకాక, ప్రపంచ క్రికెట్లో మూడో స్థానానికి చేరాడు. రాహుల్ కంటే ముందు క్రిస్ గేల్ మొదటి స్థానంలో, బాబర్ రెండో స్థానంలో ఉన్నారు. గత రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాహుల్ 30 పరుగులు చేయడంతో ఈ రికార్డు అతని పేర నమోదైంది.