బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా రేపు (మార్చి 1) నుంచి భారత్-ఆసీస్ మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇండోర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో వరుస రెండు టెస్ట్‌లను సునాయసంగా గెలిచిన భారత్ మూడో టెస్ట్ లోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది. మూడో టెస్ట్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఓపెనర్లు కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ ఇద్దరూ నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. దీంతో వరుసుగా విఫలమవుతున్నా రాహుల్ స్థానంలో గిల్‌ను ఆడిస్తారన్న వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది యాజమాన్యం. ఇక టీమ్ నుంచి కూడా తీసేస్తారని వార్తలు వస్తున్నాయి.
అయితే రోహిత్ శర్మ మాత్రం కేఎల్ రాహుల్‌ను వెనకేసుకొచ్చాడు. ప్రతిభావంతులకు జట్టు యాజమాన్యం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించాడు. ఫామ్‌లో లేనప్పుడు వారికి మరింత సమయం ఇవ్వాలని తెలిపాడు. ఇక వైస్ కెప్టెన్ పదవిలో ఉన్నా, పదవి కోల్పోయినా దానికంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ ప్రాక్టీస్ చేయడంపై కూడా రోహిత్ స్పందించాడు. చివరి వరకు ఎవరు జట్టులో ఉంటారో చెప్పలేమని అందుకోసం ప్రతి ఒక్కరూ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఎవరైనా గాయపడితే వారి బదులు మరొకరు జట్టులోకి వస్తారని సమాధానమిచ్చాడు రోహిత్. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు గంటల తరబడి ప్రాక్టీస్ చేయడం సాధరణ విషయమే అని టీం ఇండియా కెప్టెన్ కొట్టిపారేశాడు
రోహిత్ వ్యాఖ్యలతో మూడో టెస్ట్‌లో ఎవరూ బరిలోకి దిగుతారన్నదానిపై సంధిగ్థం నెలకొంది. రోహిత్ మాటలు బట్టి కేఎల్ రోహుల్‌కు మరో ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఈ సంవత్సరం సూపర్ ఫామ్‌లో గిల్‌ను రాహుల్ స్థానంలో దించే అవకాశం కూడా లేకపోలేదు.