know about lady naga sadhuvu
mictv telugu

అక్కడ కూడా ఆడవాళ్ళు ఉంటారట.

January 24, 2023

 know about lady naga sadhuvu

భారతదేశంలో భక్తికి కొరత లేదు. ఏరులు, నదులై ప్రవహిస్తూ ఉంటుంది. మామూలు మనుషులే భక్తిలో మునిగితేలుతున్నారు ప్రస్తుత కాలంలో. ఇక సాధువులు, బాబాల గురించి చెప్పనే అక్కరలేదు. వీధికో బాబా, సాధువు పుట్టుకొస్తున్నారు. మళ్ళీ ఇందులో చాలా రకాలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనో ప్రత్యేకంగా చెప్పుకునే జాతి ఒకటి ఉంది. అదే నాగ సాధువు జాతి. కుంభమేళా లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపించే వీరు, వీరి వేషధారణ, ప్రవర్తన అన్నీ విచిత్రంగా ఉంటాయి. ఈ సాధువులు హిమాలయాల్లో ఉంటారని, కఠిన తపస్సు చేస్తారని చెబుతుంటారు. ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియదు కానీ భారతదేశంలో ఇలాంటి నాగ సాధువులు చాలా ఎక్కువ మందే ఉన్నారన్నది మాత్రం నిజం.

నాగసాధువులు అనగానే మనకు మగవారే గుర్తుకువస్తారు. అయితే ఇందులో ఆడవాళ్ళు కూడా ఉంటారుట. మహిళలు కూడా నాగ సాధువులుగా మారతారట. అందుకోసం అనేక షరతులను అంగీకరించడమే కాదు.. కఠినమైన నియమాలను సైతం పాటిస్తారట.స్త్రీ నాగ సాధువులను నాగిన్, అవధూత అనే పేర్లతో పిలుస్తారుట. ఇతర సాధువులు వీరిని తల్లి అని పిలుస్తారు. మహిళా నాగ సాధువులు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పూర్తిగా శివునికి అంకితమై ఉంటారుట. వీరిలో అఖాడ జాతి ప్రపంచంలోనే అత్యంత పెద్దది.

మాఘ మాసంలో మాఘ పూర్ణిమ రోజున ప్రయాగ్ రాజ్ లో మాఘ మేళాలో గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద పండుగ వాతావరణం ఉంటుంది. ఈ మేళాకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులతో పాటు అఘోరాలు,సాధువులు, నాగ సాధువులు తండోపతండాలుగా తరలివస్తారు.అయితే వీరందరిలో నాగ సాధువులు అందరి కంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. కుంభ మేళాలో ఉన్నంత సాధువుల సంఖ్య ఉండకపోయినప్పటికీ.. నాగ సాధువులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తారుట దీనికి.ఈ మేళాకు మగ నాగ సాధువులతో పాటు నాగిన్ లు కూడా వస్తారుట.

మామూలుగా సాధువులుగా మారేందుకు చాలా ప్రక్రియ ఉంటుంది. కఠినమైన తపస్సులు చేయాల్సి ఉంటుందిట. అందరినీ వదిలేసి గురువు ఆజ్ఞను పాటిస్తూ…నియమనిష్టలతో ఉండాలని చెబుతారు. అలా ఎన్నో ఏళ్ళు ఉంటేనే కానీ వాళ్ళు నాగసాధువులు అవ్వరు అంటారు. అదే విధంగా మహిళలు నాగ సాధువులుగా మారేందుకు తమ జీవితాన్ని దేవునికి అంకితం చేయాల్సి ఉంటుందిట. వీరంతా అడవుల్లో, గుహల్లో నివసిస్తారు. సాధువులుగా మారేందుకు కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సును చేస్తారు. ఎలాంటి మహిళలైనా 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచార్యం పాటించాల్సి ఉంటుంది. ఇలా నిష్టగా ఉంటేనే వారు నాగ సాధువుగా మారేందుకు గురువుల నుంచి అనుమతి లభిస్తుంది. అలాగే వారి గత జీవితం గురించి సమాచారం సంగ్రహించబడుతుంది. ఆ సమయంలో వారు సాధువుగా మారేందుకు అర్హులని గురువులను ఒప్పించాలి. మహిళా నాగ సాధువుల విభాగంలో చేరేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది.

మగవారైనా, ఆడవారైనా నాగ సాధువులు పరమేశ్వరుణ్ణి పూజిస్తారు. తమ శరీరంపై బూడిద, నుదుటిపై తిలకం రాసుకుని తిరుగుతూ ఉంటారు. మగ నాగ సాధువుల మాదిరిగానే మహిళ నాగ సాధువులు కూడా గత జీవితాలను పూర్తిగా మరచిపోవాల్సి ఉంటుంది. తలనీలాల ప్రక్రియ పూర్తయి కుంభ మేళాలో స్నానం చేసిన తర్వాతనే ఒక స్త్రీ నాగ సాధువుగా మారుతుంది. అయితే మగ నాగ సాధువులు నగ్నంగా ఉంటారు. కానీ ఆడ నాగ సాధువులు శరీరమంతా కప్పుకుంటారు.కాషాయ గుడ్డను ధరిస్తారు. ఈ వస్త్రాన్ని గంటి అంటారుట. వీరు సన్యాసులకు తప్ప ఎవరికీ నమస్కారం చేయరు. దీక్ష తీసుకునే సమయంలో ఈ నియమాలను నాగ సాధువులను పాటిస్తారు. కుంభ మేళా సమయంలో నాగ సాధువుల మాదిరిగానే మహిళా నాగ సాధువులకు రాజ స్నానం చేస్తారు. అయితే పురుషులు చేసిన తర్వాతే స్త్రీలు స్నానం చేయాల్సి ఉంటుంది.

నాగ సాధువులలోని శాఖలు..

బుుషుల లోకంలో నాగ అనేది ఒక బిరుదు. వీరికి శైవ, వైష్ణవ, ఉదాసిన్ వంటి అనేక శాఖలున్నాయి. మగ నాగ సాధువులు ప్రతిచోటా నగ్నంగా ఉండటానికి అనుమతి ఉంటుంది. కానీ మహిళా నగ సాధువులు అలా చేయలేరు. మగ నాగ సాధువులు రెండు రకాలు, మొదటి రకం దుస్తులు ధరించి ఉంటారు. రెండో రకం డింగ్ బార్ అంటే పూర్తిగా నగ్నంగా ఉంటారు. మహిళా నాగ సాధువులు మాత్రం కాషాయ దుస్తులలో ఏకవస్త్రం ధరించి జీవనం సాగిస్తుంటారు.