Know How To Book Last Minute Tatkal Ticket Through IRCTC App
mictv telugu

చివరి నిమిషంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC యాప్, తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.!!

February 12, 2023

Know How To Book Last Minute Tatkal Ticket Through IRCTC App

చివరి నిమిషంలో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఇంకా రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోలేదా? చింతించకండి. IRCTC తన తత్కాల్ స్కీం ద్వారా ప్రయాణానికి ఒక రోజు ముందు రైలులో బెర్త్ బుక్ చెసుకునే ఛాన్స్ ఇస్తోంది. ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ స్కీమ్ ద్వారా మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ దాదాపు అన్ని రిజర్వ్ చేసిన క్లాసుల్లోనూ అన్ని రైళ్లకు తత్కాల్ టికెట్ బుకింక్స్ అందిస్తోంది. స్లీపర్ అయినా, 3ఏసీ, 2ఏసీ లేదా 1ఏసీ అయినా, ప్రయాణికులకు చివరి నిమిషంలో తత్కాల్ టికెట్ లభిస్తోంది.

టికెట్ బుక్ చేసుకునేందుకు సరైన సమయం:
ఏసీ క్లాస్ లో టికెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే ఉదయం 10గంటలకు విండో ఒపెన్ అవుతుంది. నాన్ ఏసీ తరగతులు తత్కాల్ టికెట్లను ఉదయం 11గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్ టిక్కెట్ ధర వివరాలు:
ఐఆర్‎సీటీసీ తత్కాల్ రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం ఎక్స్‎ట్రా ఛార్జీలు వసూలు చేస్తుంది. సాధారణ టిక్కెట్ ధర రూ. 900అయితే..తత్కాల్ టికెట్ కోసం దాదాపు రూ. 1300చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రయాణీకులు 400ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

ఐఆర్‎సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను ఎలా బుక్ చేయాలి:

మొదట ఐఆర్‎సీటీసీ వెబ్ సైట్ కుirctc.co.in లాగిన్ అవ్వండి.

ఐఆర్‎సీటీసీ యూజర్ ఐడీ, పాస్‎వర్డ్ తో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

ఇప్పుడు బుక్ టిక్కెట్స్ పై క్లిక్ చేయాలి.

తత్కాల్ బుకింగ్ సెలక్ట్ చేసుకోవాలి. సోర్స్, స్టేషన్, చేరుకోవల్సిన స్టేషన్, ప్రయాణ తేదీలతో సహా అన్ని వివరాలు నమోదు చేయాలి.

మీకు కావాల్సిన రైలు, తరగతిని సెలక్ట్ చేసుకోండి.

ప్రయాణీకుల వివరాలను నమోదు చేయాలి.

ఛార్జీలు, ఇతర వివరాలను సమీక్షించిన తర్వాత ప్రొసిడ్ పేమెంట్ పై క్లిక్ చేయాలి.

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ , యూపీఐ లేదా అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్ తో చెల్లింపు చేయండి.

బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోండి

ఇప్పుడు ఇ-టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి.

ఐఆర్‎సీటీసీ యాప్‌లో తత్కాల్ రైలు టిక్కెట్లను ఎలా బుక్ చేయాలి:

స్మార్ట్ ఫోన్‌లో IRCTC యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.

యాప్‌ ఒపెన్ చేసి మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అవ్వండి.

“తత్కాల్ బుకింగ్” ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

రైలు, మీకు కావాల్సిన తేదీని ఎంచుకోండి.

ప్రయాణీకులకు సంబంధించి పూర్తి వివరాలను పూరించండి.

మీకు కావాల్సిన సీటు, తరగతి, బెర్త్ ఎంచుకోండి.

టిక్కెట్ ధరను తెలుసుకోండి.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపు చేయవచ్చు.

చెల్లింపు స్టేటస్ చెక్ చేయండి. కన్ఫర్మ్ అయ్యాక టికెట్ డౌన్‌లోడ్ చేయండి.