know-the-benefits-on-sitting-on-floor
mictv telugu

నేల మీద కూర్చుంటే ఎన్ని లాభాలో తెలుసా…

March 13, 2023

know-the-benefits-on-sitting-on-floor

మన అమ్మలు, అమ్మల కాలంలో చక్కగా.. అందరూ నేల మీద కూర్చుని భోజనం చేసేవాళ్ళు. అప్పట్లో సోఫాలు లాంటివి ఉండేవి కాదు కాబట్టి ఎక్కువసేపు నేల మీదనే కూర్చునేవారు అందరూ. ఎంచక్కా నేల మీద బాసిపెట్లు వేసుకుని సరదాగా అష్టాచమ్మా, పులిమేక లాంటి ఆటలు ఆడేవాళ్ళు. ఊళ్ళలో మగవాళ్ళ మీటింగ్‌లూ నేలపైనే జరిగేవి. కానీ, ఇప్పుడు.. మనకు కుర్చీ, సోఫాలపై నుంచి దిగి.. కింద కూర్చోవాలంటే.. ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంటుంది. దానికి తోడు ప్రస్టీజ్ ఇష్యూ ఒకటి. టేబుళ్ళ మీద భోజనాలు, కూర్చీ మీద కూర్చుని ఆడుకునే ఆటలు, ఏదైనా గెట్‌ టూ గెదర్ అయినా.. కుర్చీలు, సోఫాల మీదే.. మన ఆసనం ఉంటుంది. కింద కూర్చోవడం అనే అలవాటును చాలా వరకు వదిలేశాం. కానీ, రోజులో కొంతసేపైనా.. నేలపై కూర్చోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు.

వెన్నెముక కోసం:

వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కొంతసేపైనా నేలపైన కూర్చోవాలని చెబుతున్నారు. నేలమీద కూర్చోవడం వల్ల వెన్నెముక దాని షేప్‌లో ఉంటుంది. మన భంగిమను సరిచేస్తుంది. పేలవమైన భంగిమ, వంగడం, ముందుకు వంగి కూర్చోవడం వంటి కారణాల వల్ల.. వెన్నెముక షేప్‌ దెబ్బతింటుంది. దీని కారణంగా వెన్నెముక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

హిప్‌ :

మన తుంటి తొడ, దిగువ వీపు, కటికి అనుసంధానించే కండరాలను హిప్ ఫ్లెక్చర్ అంటారు. ఇది బలహీనపడితే.. నడక, స్థిరత్వం, సమతుల్యతపై ప్రభావం పడుతుంది. నేలపై కూర్చోవడం వల్ల తుంటి కండరాలు బలోపేతం అవుతాయి. అంతేకాదు నేలపై కూర్చుంటే మన పోస్చర్ సరి అవుతుంది. నేలపై కూర్చునేప్పుడు.. దిగువ కండరాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు.. నేలపై కూర్చున్నప్పుడు వంగకుండా ఉంటాం.

ఆయుర్దాయం పెరుగుతుంది..

నేలపై కూర్చోవడం వల్ల ఆయుర్దాయం కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ప్రివెంటివ్ కార్డియాలజీ జర్నల్‌లోని అధ్యయనం ప్రకారం కింద కూర్చునే అలవాటు ఉంటే.. జీవిత కాలం పెరుగుతుంది.experts