Know These Steps To Transfer EPF Account From Old To The New Employer
mictv telugu

ఉద్యోగంతో పాటు.. ఈపీఎఫ్ ఖాతాను కూడా మార్చుకున్నారా?

February 11, 2023

Know These Steps To Transfer EPF Account From Old To The New Employer 12

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) అనేది భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఒక సామాజిక భద్రతా కార్యక్రమం. అయితే పాత పీఎఫ్ ఖాతా నుంచి కొత్త పీఎఫ్ ఖాతాలోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.
సాధారణంగా.. ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగి, యజమాని నుంచి విరాళాలను సేకరిస్తుంది. పదవీ విరమణ ఆధారిత పొదుపు లేదా పెట్టుబడి ఖాతాగా ఇది పరిగణించబడుతుంది.
ఒక వ్యక్తి ఉద్యోగం మారినప్పుడు వారు తప్పనిసరిగా వారి ఈపీఎఫ్ ఖాతాను కొత్త యాజమాన్యానికి బదిలీ చేయాలి. పీఎఫ్ ఖాతాను ఆన్ లైన్ లో బదిలీ చేయడానికి పాత, కొత్త యజమానులిద్దరి దగ్గర ఏకీకృత మెంబర్ ఇ-సేవా పోర్టల్ ద్వారా బదిలీ ప్రారంభించాలి. ఒకవేళ ఇది కుదరకపోతే ఫారం 13ని మాన్యువల్ గా పూరించి హెచ్ఆర్ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో ఈ ప్రక్రియ కోసం..
1. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఈ అధికారిక సభ్య సేవా పోర్టల్ ను సందర్శించండి.
2. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్ వర్డ్ ను నమోదు చేయడం ద్వారా మీరు లాగిన్ చేయవచ్చు.
3. ఆన్ లైన్ సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేసి ‘వన్ మెంబర్ – వన్ ఈపీఎఫ్ అకౌంట్’(బదిలీ అభ్యర్థన)ని సెలెక్ట్ చేసుకోండి.
4. ఇప్పుడు మీకు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మీరు డబ్బు బదిలీ చేయాలనుకుంటున్న కొత్త ఈపీఎఫ్ వివరాలను ఇక్కడ పూరించాలి. మీ జీతం స్లిప్ లేదా రిక్రూటర్ ఈపీఎఫ్ స్టేట్ మెంట్ లో మీ కొత్త ఈపీఎఫ్ ఖాతా నంబర్ ను కనుగొనవచ్చు.
5. మీ ఆన్ లైన్ బదిలీ ధృవీకరణ ప్రస్తుత యజమాని లేదా మునుపటి యజమాని ద్వారా చేయబడుతుంది. లేదా ఇక్కడే మీరే ఎంచుకోవచ్చు. ఈ ఎంపికను పూరించడానికి మీరు వారిని ఒకసారి తనిఖీ చేయండి.
6. ఇద్దరు యజమానుల UAN ఒకేలా ఉంటే.. మునుపటి ఈపీఎఫ్ ఖాతా నంబర్ ను నమోదు చేయండి. అవి ఒకేలా లేకుండా పాత యజమాని UAN నమోదు చేయండి.
7. గెట్ డిటైల్స్ పై క్లిక్ చేయండి. మీరు మీ ఖాతాలో సమాచారాన్ని చూస్తారు. డబ్బు బదిలీ చేయబడే ఖాతాను ఎంచుకోండి.
8. వన్ టైమ్ పాస్ట్ వర్డ్ పొందడానికి ‘ఓటీపీ ఆప్షన్’ని క్లిక్ చేయండి. సంబంధిత ఫీల్డ్ ను నమోదు చేసి అభ్యర్థనను ధృవీకరించండి.
మీ బదిలీ అభ్యర్థన విజయవంతంగా సమర్పించబడుతుంది. మీరు బదిలీ అభ్యర్థనను సమర్పించిన 10 రోజులలోపు ఉద్యోగి తప్పనిసరిగా ఎంచుకున్న కంపెనీకి పీఎఫ్ బదిలీ అభ్యర్థన, స్వీయంగా ధృవీకరించబడిన కాపీని అందించాలి. బదిలీ పూర్తి కావడానికి సాధారణంగా 30-45రోజులు పడుతుంది. మీకు అందించిన రిఫరెన్స్ నంబర్ ను ఉపయోగించి మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్ లో మీ అభ్యర్థన పురోగతిని కూడా ట్రాక్ చేయవచ్చు.
Changed job, transfer, EPF, New employer, old, new
Just Changed Job? Know These Steps To Transfer EPF Account From Old To The New Employer