కామారెడ్డి జిల్లా దోమకొండలో అరుదైన దృశ్యం కనిపించింది. సుబ్రమణ్యం ఆలయంలోని శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. ఉదయం ఆలయం తలుపులు తీయగానే గర్భగుడిలో శివలింగంపై పాము కనిపించింది. లింగాన్ని చుట్టుకుని కొంచెం సేపు ఉన్న పాము.. అనంతరం లింగం చుట్టూ సుమారు గంట పాటు ప్రదక్షిణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
దీంతో హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ:శివాయ వంటి శివ నామస్మరణలతో ఆలయ ప్రాంతం మార్మోగిపోయింది. ఇది ఇది దైవ మహిమే అని భక్తులు అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ పాము అక్కడి నుంచి వెళ్లకపోవడంతో స్నేక్ క్యాచర్‌ను పిలిపించి దానిని పట్టించారు. అనంతరం దట్టమైన ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. ఇక అప్పుడప్పుడు పాములు ఆలయంలో దేవతా విగ్రహాల దగ్గర దర్శినమిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.