ఎస్పీ ఆదర్శం.. కూతురుకు అంగన్‌వాడీ సెంటర్‌లో చదువు - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్పీ ఆదర్శం.. కూతురుకు అంగన్‌వాడీ సెంటర్‌లో చదువు

October 18, 2019

ఐదు అంకెల జీతం వస్తే చాలు తమ పిల్లలను ప్లేస్కూల్‌లో చేర్పించేస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించే వాళ్లు చాలు ఉన్నారంటే చాలా తక్కువనే చెప్పవచ్చు. అంగన్‌వాడీ కేంద్రాలు అంటే పేదవారి పిల్లలకే అనే ఆలోచనలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి చిన్నారులకు ఆటపాటలు, పౌష్టికాహారం అందిస్తున్న ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు  వాటివైపే చూడరు. కానీ అటువంటి వారి దృక్పతాన్ని మార్చుతూ ఓ ఎస్పీ ఏకంగా తన కూతురును అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. 

SP Admits.

కర్ణాటకలోని కొడుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి. పన్నేకర్  తన కుమార్తెను అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తన 2 సంవత్సరాల 6 నెలల ఖుషీని మిగితా చిన్నారులతో పాటు ప్రతి రోజూ తీసుకెళ్తున్నారు. వారితో కలిసి దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సామాన్య ప్రజల ఆలోచనను మార్చేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నా తమ కూతురును సాధారణంగా పెంచుతున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు ధీటుగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు.