మార్కెట్‌లోకి కొడాక్‌ టీవీలు..ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్‌లోకి కొడాక్‌ టీవీలు..ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ

March 18, 2020

Kodak

ప్రస్తుతం ఆండ్రాయిడ్ టీవీల హవా నడుస్తోంది. ప్రముఖ టీవీ తయారీ సంస్థలు ఆండ్రాయిడ్ టీవీలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. తాజాగా ప్రముఖ కెమెరా తయారీ సంస్థ కొడాక్ సంస్థ ఆండ్రాయిడ్ టీవీలను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది. ‘కొడాక్‌ సీఏ సిరీస్‌’ పేరుతో ఈ టీవీలను సోమవారం భారత మార్కెట్లోకి విడుదలచేసింది. 43, 50, 55, 65 అంగుళాల సైజుల్లో ఈ టీవీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 23,999గా నిర్ణయించగా హై ఎండ్‌ రూ. 49,999కే లభించనుంది. మార్చి 19 నుంచి ఈ సీరిస్‌ టీవీలు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉండనున్నాయి.

 

కొడాక్‌ సీఏ సిరీస్‌ టీవీ ఫీచర్లు

 

* డాల్బీ విజన్,

* 4కే హెచ్‌డీఆర్‌10,

* ఆండ్రాయిడ్‌ 9.0 ఇంటర్‌ఫేస్,

* డీటీఎస్‌ ట్రూసరౌండ్‌ డాల్బీ డిజిటల్‌ ప్లస్,

* యుఎస్‌బీ 3.0,

* బ్లూటూత్‌ వీ5.0.