కోడెలది ఆత్మహత్యే.. పోస్టుమార్టం వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

కోడెలది ఆత్మహత్యే.. పోస్టుమార్టం వెల్లడి

September 16, 2019

Kodale Shivaprasad Rao.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంపై ఊహాగానాలకు పోస్టుమార్టం నివేదిక తెరదించింవది. ఆయన గుండెపోటు కాదని, ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. చెవుల మీదుగా మెడ భాగంలో 8 అంగుళాల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు గుర్తించారు.

 ఫోరెన్సిక్‌ వైద్యులైన ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉస్మానియా ఆస్పత్రిలో సుమారు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియోలో రికార్డ్‌ చేశారు. అనంతరం పార్థివదేహానికి ఎంబామింగ్‌ చేశారు. ఆ తర్వాత కార్యకర్తల సందర్శనార్థం మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు తరలించారు. అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. 

కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్‌ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటైంది. ఈ సందర్భంగా కోడెల నివాసంలో సిట్ బృందం తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్‌ టీమ్‌ కూడా పలు ఆధారాలను సేకరించింది.