మంత్రి కొడాలి నాని రీ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి కొడాలి నాని రీ కౌంటర్

December 20, 2021

చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి సోమవారం తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని కౌంటర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అవును నిజమే చెడు చేసినవాళ్లు ఎవరి పాపాన వాళ్లే పోతారు. భార్య పేరును రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకే చెల్లుతుంది, ఆమె శాపం తప్పకుండా బాబుకే తగులుతుంది’ అని అన్నారు.

ఆడవాళ్లను రోడ్డుమీదికి తెచ్చింది ఎవరు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురుతగలడం ఖాయమని, వచ్చే ఎన్నికల తరువాత ప్రతిపక్ష పార్టీ హోదా కూడా పోతుందని జోస్యం చెప్పారు. దీంతో మళ్లీ చంద్రబాబు కుటుంబ సభ్యులపై రాజకీయం పరంగా పోటాపోటీగా వ్యాఖ్యలు చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయలో చర్చ మొదలైంది.