Kodali Nani...will contest from Gudivada: Renuka Chaudhary
mictv telugu

కొడాలి నాని..గుడివాడ నుంచే పోటీ చేస్తా: రేణుకా చౌదరి

September 20, 2022

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా రేణుకా చౌదరిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ”ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి, అమరావతిలో ఏం పని?” అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. గుడివాడలో కొడాలి నాని పనైపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలో గుడివాడ నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు.

రేణుకా చౌదరి మాట్లాడుతూ..”కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే నేను కార్పొరేటర్‌ని. బుజ్జీ నీకు చరిత్ర తెలియదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్‌ఫోన్‌లో గూగుల్ కొట్టు. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మినిస్టర్‌వి కదా. నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్.. కొడాలి నాని. ఎంత అమాయకుడువు నువ్వు. ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి, నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చావు. ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నాని వల్ల నాకు గుడివాడలో మంచి పబ్లిసిటీ వచ్చింది. నేను టీడీపీకి మద్దతుగా లేను. నాని నాకు మంచి ఐడియా ఇచ్చావు. నేను వచ్చే ఎన్నికల్లో నీ నియోజకవర్గమైన గుడివాడ నుంచే పోటీ చేస్తా” అని ఆమె అన్నారు.

అంతేకాదు, తాను మున్సిపల్ కార్పొరేటర్‌గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేశానని, ఎమ్మెల్యేగా ఎప్పుడూ చేయలేదని, గుడివాడలో పోటీ చేసి ఆ ఎమ్మెల్యే పదివిని కూడా అలకరిస్తానని ఆమె తెలియజేశారు. దీంతో కొడాలి నానిని గుడివాడలోనే కాదు, రాష్ట్రంలో ఎవరూ మళ్లీ ఎన్నుకోరని, ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని రేణుకా చౌదరి పేర్కొన్నారు.