కోదండరాం నిరాహార దీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరాం నిరాహార దీక్ష

October 31, 2017

తెలంగాణ జేఏసీ సమావేశాలను  రాష్ట్ర  ప్రభుత్వం అడ్డుకుంటున్నందుకు నిరసనగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిరాహార దీక్ష చేపట్టారు.

మంగళవారం తార్నాకలోని తన ఇంటి ముందే ఆయన ఒక రోజు దీక్షను ప్రారంభించారు. ప్రజాస్వామికంగా జరుపుకుంటున్న సభలకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. త‌న దీక్ష 24 గంట‌ల పాటు కొన‌సాగుతుంద‌ని చెప్పారు.  దీక్షకు జేఏసీతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. అమరుల స్ఫూర్తి యాత్ర, కొలువుల కొట్లాట సభలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం తెలిసిందే.