ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం.. విపక్షాలకు టీజేఎస్ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం.. విపక్షాలకు టీజేఎస్ లేఖ

September 19, 2020

ty

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు టీజేఎస్ అధ్యక్షుడు,ప్రొఫెసర్ కోదండరాం సిద్ధం అయ్యారు. తన అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరుతూ టీజేఎస్ పార్టీ తరుపున నేతలు విపక్షాలకు లేఖలు కూడా పంపించారు. ఈ సమయంలో ఆయన విజయం ఆవశ్యకమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని కోరారు. మండలిలో ప్రజా సమస్యలపై గొంతెత్తె ఉద్యమ నాయకుడు కావాలని పేర్కొన్నారు.  

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ స్థానం నుంచి కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే తాను బరిలో నిలుస్తున్నట్టుగా మద్దతు కోరారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది. దీనిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.