కేసీఆర్ సర్కారు జేఏసీపై కక్ష గట్టింది - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కారు జేఏసీపై కక్ష గట్టింది

October 30, 2017

కేసీఆర్ సర్కారు ప్రజాస్వామిక ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచేస్తోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. నల్లగొండ అమరుల స్ఫూర్తి యాత్రను, కొలువుల కొట్లాట సభను సర్కారు అడ్డుకుని,  రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లే కోర్టుకు వెళ్లామని సోమవారం చెప్పారు.

‘సభలు, సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు అందరికీ ఉంది. తెలంగాణ సర్కారు కావాలనే జేఏసీ సభను కక్షపూరితంగా అడ్డుకుంటోంది. చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది. చివరకు  ప్రభుత్వం కోర్టు ప్రక్రియను కూడా ప్రహసనంగా మార్చేస్తోంది. కానీ మేం వెనక్కి తగ్గం. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కోర్టును వినియోగించుకుంటాం.

జేఏసీ నేతలను నిర్బంధించ కూడదని కోర్టు ఆదేశించింది. అయినా అరెస్టులు కొనసాగిస్తున్నారు.. అన్ని విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. అనేక ప్రాంతాల్లో జేఏసీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో పెట్టారు. వారిని వెంటనే విడుదల చేయాలి. మంగళవారం కోర్టు నిర్ణయం వస్తుంది. నిజాం కళాశాల గ్రౌండ్, ఎన్టీఆర్ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, నాగోల్ రోడ్డులో ప్రైవేటు స్థలాల్లో ఏదో ఒకదాన్ని కొలువుల కొట్లాట సభ ఇవ్వాలని అనుమతి కోరాం’ అని కోదండరాం చెప్పారు.