పీకే పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు.. ఇది ఆయన పనే - MicTv.in - Telugu News
mictv telugu

పీకే పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు.. ఇది ఆయన పనే

May 2, 2022

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్‌పై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే ప్రకటన వెనుక కేసీఆర్ ఉన్నారని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కేసీఆర్ పీకేను వాడుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ, పీకే పెట్టబోయే రాజకీయ పార్టీ రెండూ ఒకటేనని తెలిపారు. ఇదికాక, ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సభకు అనుమతినివ్వకపోవడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. వివిధ పార్టీల నాయకులు యూనివర్సిటీకి రావడం వల్ల విద్యార్ధులకు మేలు జరుగుతుందని, సభకు అనుమతి ఇవ్వాలనేదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు. ఇక, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే 25 నియోజక వర్గాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టామని, కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని వెల్లడించారు.