ఓపెన్ కాస్టు రద్దయ్యే దాకా పోరు - MicTv.in - Telugu News
mictv telugu

ఓపెన్ కాస్టు రద్దయ్యే దాకా పోరు

May 24, 2017

ఓపెన్ కాస్టు రద్దయ్యే వరకు పోరాటం చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. కల్యాణఖని ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా ఎర్రగుంటపల్లిలో కొనసాగుతున్న దీక్షలు ఇవాళ్టికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ దీక్షలు చేస్తున్న గ్రామస్తులకు కోదండరాంతో సహా విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురుజాల రవిందర్ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లెష్ సంఘీభావం తెలిపారు. ఓపెన్ కాస్ట్ రద్దు అయ్యే దాకా పోరు ఆపోద్దని సూచించారు.