హాట్సాఫ్.. రూ.1 కోటి గెలిచిన దివ్యాంగురాలు - MicTv.in - Telugu News
mictv telugu

హాట్సాఫ్.. రూ.1 కోటి గెలిచిన దివ్యాంగురాలు

January 21, 2020

Rs 1 Crore.

టీవీలో ప్రసారమయ్యే ఓ షోలో దివ్యాంగురాలైన ఒక మహిళ రూ.1 కోటి గెల్చుకుని చరిత్ర సృష్టించారు. ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్‌ యాంకర్‌గా నిర్వహిస్తున్న ‘కోటీశ్వరి’ షో తమిళ కలర్స్ ఛానల్‌లో ప్రసారం అవుతోంది. ఈ షోలో ఇటీవల మదురైకి చెందిన 31 ఏళ్ల కౌసల్య కార్తీక పాల్గొని రూ.1 కోటి రూపాయలు గెలుచుకున్నారు. 

పుట్టుకతోనే చెవుడు ఉన్న కౌసల్య పెదవుల కదలికల ఆధారంగా ఎదుటి వ్యక్తి మాటలను గ్రహించి సమాధానాలు ఇస్తుంటారు. అయితే ఆమెకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఎక్కువ. ఈ లక్షణాలతోనే ఆమె కోటీశ్వరి షోలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. చెన్నైలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌసల్యకు రాధిక, వైకామ్‌18 సంస్థ ప్రతినిధి రవీష్‌కుమార్‌ల చేతుల మీదుగా చెక్కు అందించారు. ఈ కోటితో ఏం చేస్తారని అడగగా… తనకులా బాధపడుతున్న బధిరుల సంక్షేమం కోసం వినియోగిస్తానని, నాగర్‌కోయిల్‌ ఉన్న బధిరుల పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తానని తెలిపారు. అలాగే స్విట్జర్లాండ్‌లో పర్యటించాలన్న తన కలను నెరవేర్చుకుంటానన్నారు. కౌసల్య విజయంపై రాధిక స్పందిస్తూ..’కౌసల్య జ్ఞానం, పట్టుదలతో చరిత్ర సృష్టించింది’ అన్నారు. కోటీశ్వరి షో హిందీలో ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్పతికి తమిళ వెర్షన్.