కుప్ప కూలిన కోహెడ పండ్ల మార్కెట్..రైతులకు గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

కుప్ప కూలిన కోహెడ పండ్ల మార్కెట్..రైతులకు గాయాలు

May 4, 2020

Koheda fruit market rangareddy

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా ఈదురు గాలులతో కురుస్తున్న వర్షానికి కోహెడ పండ్ల మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఫ్రూట్ మార్కెట్ షెడ్ మొత్తంగా కూలిపోవడంతో పలువురు హమాలీలతో పాటు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

అయితే అక్కడ అంబులెన్స్ లేకపోవడం క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి ఆలస్యం జరుగుతుంది. మార్కెట్లో సరైన వసతులు లేక పోయినప్పటికీ తరలించడం పట్ల రైతులతో పాటు హమాలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్ ని కోహెడ ఫ్రూట్ మార్కెట్ కు తరలించిన సంగతి తెల్సిందే. తాత్కాలికంగా షెడ్లను నిర్మించి కోహెడ ప్రాంతంలో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు.