kohili birthday celebrations in austrelia
mictv telugu

కోహ్లీ బర్త్ డే వేడుకలు..వీడియో వైరల్

November 5, 2022

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కింగ్ కోహ్లీ పుట్టిన రోజు వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెబుతున్నారు అతని అభిమానులు. భారీ కటౌట్స్ పెట్టి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక క్రికెట్లరు కూడా కోహ్లీకి శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.ఈ పోస్ట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియాలో టీం ఇండియా సభ్యులు కోహ్లీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌ ఇవాళ ఉదయమే జరుగగా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ఇందులో విరాట్‌ కోహ్లీ కేక్‌ కట్‌ చేయగా మిగతా ప్లేయర్లు ఎంజాయ్‌ చేయడం స్పష్టంగా కనిపించింది.

గ‌త రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతోన్న కోహ్లి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మాత్రం సూపర్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నాలుగు మ్యాచ్ ల్లో మూడు అర్థసెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు.