లేడీ పోలీసోళ్లతో కోహ్లీ ముచ్చట్లు - MicTv.in - Telugu News
mictv telugu

లేడీ పోలీసోళ్లతో కోహ్లీ ముచ్చట్లు

May 29, 2017

 

టీమిండియాలో కోహ్లీ వెరీ డిఫరెంట్. ఫీల్డ్ లోనే కాదు..బయటకూడా సరదాగా ఉంటాడు. లండన్ లో లేడీ పోలీసులతో ముచ్చట్లు పెట్టాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా లండన్‌లో కివీస్ తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌కు ముందు కోహ్లి లేడీ పోలీసును విష్ చేశాడు. గతవారం మాంచెస్టర్‌లో ఉగ్రవాద దాడి జరిగి.. 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ లో సెక్యూరిటీ టైట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఓ భద్రతాధికారిణితో కోహ్లి నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసింది. వార్మప్‌ మ్యాచ్‌కు వెళ్లడానికి ముందు కోహ్లి భద్రతాధికారిని పలుకరించి ముచ్చటించారని తెలిపింది.