టైమ్ దొరికితే చాలు టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లీ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేయసి అనుష్క శర్మను వెంటేసుకుని సరదా సరదాగా గడపుతున్నారు. వెస్టిండీస్ టూర్ ముగియడంతో కోహ్లీ అటు నుంచే న్యూయార్క్ వెళ్లి అనుష్క ని కలిశాడు. ఇద్దరూ కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న సెల్ఫీని విరాట్ షేర్ చేశాడు. అంతకుముందే ఈ ఇద్దరూ రోడ్ సైడ్ నిల్చున్న ఫొటో వైరల్ అయింది.
త్వరలో జరిగే ఐఫా అవార్డుల సెర్మనీలో విరాట్‌తో కలిసి పాల్గొననుంది. ఈ నెల 15న రాత్రి న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది.అప్పటిదాకా న్యూయార్క్ వీధులన్నీ నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ గువ్వ గోరింకలవే..