Kohli achieved two feats in the semis match against England
mictv telugu

ఇంగ్లండ్‌తో మ్యాచులో రెండు ఘనతలు సాధించిన కోహ్లీ

November 10, 2022

Kohli achieved two feats in the semis match against England

టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఓటమి ఓకే కానీ, మరీ ఇంత దారుణంగా ఒక్క వికెట్ కూడా తీయకుండా ఇంటి ముఖం పట్టడమేంటని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కంట తడి పెట్టగా.. కోహ్లీ మైదానంలో నిరాశగా కనిపించాడు.

అయితే ఈ మ్యాచ్ ద్వారా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రెండు రికార్డులను సాధించడం అభిమానులకు కాస్త ఊరట కలిగించే అంశం. ఈ మ్యాచులో మొత్తం 50 పరుగులు చేసి ఔటయిన కోహ్లీ.. 42 పరుగుల వద్ద టీ20ల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. ఇదొక రికార్డయితే మొత్తం టీ20 మ్యాచులలో వంద ఫోర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌‌‌గా అవతరించాడు. అటు ప్రస్తుత ప్రపంచ కప్‌‌లో పరుగుల పరంగా కోహ్లీ 270 పరుగులతో అందరికంటే ముందున్నాడు. ఆరు మ్యాచుల్లో ఈ పరుగులు సాధించగా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కచ్చితంగా వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. గతంలో 2014, 2016 ప్రపంచ కప్‌‌లలో రెండు సార్లు కోహ్లీ ఈ అవార్డును అందుకున్నాడు. మరి అభిమానుల అంచనాలు నిజమై ఈ సారి ఆ అవార్డు వస్తుందేమో చూడాలి.