ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమైన రోజునుంచి విరాట్ కోహ్లి బ్యాటింగ్ పరంగా ఘోరంగా విఫలమవుతూ, అభిమానులను నిరాశ పరిచాడు. దీంతో కొంతమంది ఆర్సీబీ అభిమానులు విరాట్ కోహ్లిని కొద్ది రోజులు పక్కన పెట్టాలని సోషల్ మీడియాలో తెగ విమర్శలు చేశారు. మరికొంతమంది కోహ్లి ఫామ్ కోల్పోయాడు అంటూ కామెంట్లు చేశారు. అభిమానులు చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. ఈరోజు గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి రెచ్చిపోయి సిక్సర్లు, ఫోర్లు కొడుతూ అభిమానులు చప్పట్లు కొట్టేలా హాఫ్ సెంచరీ చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు కోహ్లీ బ్యాటింగ్‌తో సమాధానమిచ్చాడు. 45 బంతుల్లోనే హాఫ్ సంచరీ సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పాత కోహ్లీని చూపించాడు.
మొదటగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు.. బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కెప్టెన్ డుప్లెసిస్ ఆరంభంలోనే డకౌట్ అయ్యాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన కోహ్లీ, పాటిదార్‌తో కలిసి ఆటను ముందుకు నడిపించాడు. పాటిదార్ 32 బంతులాడి 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. కోహ్లీ 58 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది.