వందో టెస్టు స్పెషల్.. దివ్యాంగుడికి గిఫ్టిచ్చిన కోహ్లీ - MicTv.in - Telugu News
mictv telugu

వందో టెస్టు స్పెషల్.. దివ్యాంగుడికి గిఫ్టిచ్చిన కోహ్లీ

March 8, 2022

 19

శ్రీలంకతో మొహాలీలో జరిగిన మొదటి టెస్టుతో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో వందో టెస్టు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ గెలిచిన అనంతరం మైదానం బయట బస్సెక్కేందుకు రెడీగా ఉండగా, అక్కడే ఉన్న ధరమ్‌వీర్ పాల్ అనే దివ్యాంగుడిని చూసి కోహ్లీ తన జెర్సీని ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ దివ్యాంగుడు ట్విట్టర్‌లో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇది మర్చిపోలేని విషయం. వందో టెస్టు గుర్తుగా కోహ్లీ నాకు బహుమతిగా ఇచ్చాడని పాల్ మురిసిపోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ టెస్టుల్లో ఎనిమిది వేల పరుగులను పూర్తి చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా, వందో టెస్టులో కోహ్లీ సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లవుతోంది.