Kohli's emotional tweet after defeat
mictv telugu

ఓటమి తర్వాత కోహ్లీ ఎమోషనల్ ట్వీట్..

November 11, 2022

టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ కథ ముగిసింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి..భారత్ ఆశలను ఆవిరిచేసింది. వరల్డ్ కప్‎పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. ఈ ఓటమితో భారత్ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి పయనమైంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఓ ఏమోషనల్ ట్వీట్ చేసాడు.

మా కల సాధించకుండా తీవ్ర నిరాశతో నిండిన హృదయంతో ఆస్ట్రేలియా తీరాలను వదలివెళుతున్నాం. కానీ ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలన్నదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లవేళలా గర్వంగా భావిస్తున్నా” అంటూ కోహ్లీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.