కోయిలమ్మ హీరో రౌడీయిజం.. మందుకొట్టి యువతులపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

కోయిలమ్మ హీరో రౌడీయిజం.. మందుకొట్టి యువతులపై దాడి

January 28, 2021

మా’ టీవీ చానల్లో ప్రసారమయ్యే ‘కోయిలమ్మ’ టీవీ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ నిత్యజీవితంలో విలన్‌గా మారాడు. మద్యం తాగి యువతిలపై దాడి చేశాడు. వారిని బండబూతులు తిట్టి రౌడీయిజం ప్రదర్శించాడు. గత రాత్రి మణికొండలో ఈ దారుణం జరిగింది. ఈ దృశ్యాలన్నీ మొబైల్ ఫోన్లో రికార్డయ్యాయి.
విషయంలోకి వెళ్తే.. శ్రీవిద్య, అపర్ణ‌ అనే యువతులు మ‌ణికొండ‌లో బొటిక్ వ్యాపారం చేస్తున్నారు.

వారితో కలసి వ్యాపారం చేసిన స్వాతి అనే యువతి ఇటీవల బిజినెస్ నుంచి తప్పుకరుంది. ఈ నేపథ్యంలో వివాదాలు మొదలయ్యాయి. సమీర్.. శ్రీవిద్య, అపర్ణల నుంచి 5 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. లావాదేవీలను తేల్చుకోడానికి సమీర్, స్వాతి.. శ్రీవిద్య ఇంటికి వెళ్లారు. నలుగురి మధ్య గొడవలు ముదిరాయి. అప్పటికే బాగా తాగి ఉన్న సమీర్.. శ్రీవిద్య, అపర్ణలను బండబూతులు తిట్టి బెదిరించాడు. తర్వాత శ్రీవిద్య, అపర్ణలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు స్వాతి, సమీర్‌లపై కేసు నమోదు చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని సీరియల్ హీరో తలబిరుసుతో అంటున్నాడు.