Kolkata Doctors Remove 7.5 Inches Deodorant Bottle from Stomach of a 27-Year-Old Man
mictv telugu

అతడి కడుపులో 7 అంగుళాల సెంట్ బాటిల్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

September 15, 2022

తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిని పరీక్షించిన అక్కడి డాక్టర్లు.. అతడి కడుపునొప్పికి గల కారణాలు తెలుసుకొని షాక్ అయ్యారు. మొదట ఫుడ్ పాయిజనో లేదంటే 24 గంటల కడుపునొప్పో అని అనుకున్న డాక్టర్లు.. ఎక్స్ రే రిపోర్ట్ లు చూసి కంగు తిన్నారు. 27 ఏండ్ల ఆ యువకుడు చేసిని పనికి నవ్వాలో, ఏడవాలో తెలియక.. మొత్తానికి రెండు గంటలు కష్టపడి ఆ ఆషరేషన్ ను అయితే సక్సెస్‌ఫుల్ గా ముగించారు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో బుర్ధవాన్ నగరంలోని హాస్పిటల్‌కు వెళ్లాడు. పరీక్షల నిమిత్తం అతనికి ఎక్స్ రే చేయగా.. కడుపులో 7 అంగుళాల పొడవైన సెంట్ బాటిల్ను చూసి షాకయ్యారు. ఈ క్రమంలోనే అతడికి ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు అతడికి ఆపరేషన్ చేసి, కడుపులోంచి బాటిల్‌ను బయటకు తీశారు. ఆపరేషన్ అనంతరం మాట్లాడుతూ.. ఆ యువకడు మలద్వారం ద్వారా బాటిల్‌ను లోపలికి చొంపించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. అయితే ఏడు రోజులపాటు తమ పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వార్త స్థానికంగానే కాకుండా నెటింట కూడా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.