పులుల కోసం దంపతుల వినూత్న ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

పులుల కోసం దంపతుల వినూత్న ప్రచారం

October 30, 2019

పులుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు కూడా ప్రతి ఏటా దీనికి కావాల్సిన చర్యలు చేపడుతూనే ఉన్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ఉండేందుకుకోల్‌కతాకు చెందిన రతీంద్రాదాస్, గీతాంజలి దంపతులు వినూత్న ప్రచారం చేపట్టారు. వారు ఇద్దరూ కలిసి బైక్‌పై దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టారు. 

Kolkata Family.

అభయారణ్యాల్లో తిరుగుతూ పులులను పరిరక్షించండి…పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వతేదీన ‘జర్నీ ఫర్ టైగర్’ పేరుతో తమ యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే వారు 28 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా యాత్ర పూర్తి చేశారు. ప్రజలంతా అవగాహనతో వ్యవహరించి వన్యప్రాణులను రక్షించుకోవాలని కోరుతున్నారు. బైక్‌పై దేశమంతా చుట్టివచ్చిన ఈ దంపతులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.