నీకు కరోనా సోకుగాక..జడ్జికి లాయర్‌ శాపం - MicTv.in - Telugu News
mictv telugu

నీకు కరోనా సోకుగాక..జడ్జికి లాయర్‌ శాపం

April 7, 2020

Kolkata lawyer ‘curses’ judge with coronavirus infection

ప్రపంచమంతా కరోనా వైరస్ ట్రెండ్ నడుస్తోంది. ఎవ్వరి నోట విన్న కరోనా మాటే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా కరోనానే ప్రధాన చర్చ. అయితే కొందరు శపించడానికి కూడా కరోనాను ఉపయోగిస్తున్నారు. 

తాజాగా ఓ జడ్జికి కరోనా వైరస్ సోకాలని ఓ లాయర్ శపించాడు. ఈ వింత సంఘటన పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగింది. తన కేసులో అనుకూలంగా తీర్పు ఇవ్వలేదన్న కోపంతో కోల్‌కతా హైకోర్టు జడ్జి దిపాంకర్ దత్తాకు లాయర్ బిజోయ్‌ అధికారే ఈ విధంగా శంపించాడు. దీంతో సదరు న్యాయవాదిపై కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాల్సిందిగా జడ్జి ఆదేశించారు. 14 రోజుల్లోగా సంజాయిషీ ఇచ్చుకోవాలని నోటీసు ఇచ్చాడు. తన క్లయింట్ కు చెందిన బస్సు వేలంపై స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ లాయర్‌ బిజోయ్‌ జస్టిస్‌ దిపాంకర్ దత్తను కోరాడు. కేసు విచారణ సందర్భంగా స్టే ఇవ్వడం కుదరదని దిపాంకర్ తీర్పును వెలువరించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనా బిజోయ్‌ కరోనా వైరస్‌ భారిన పడుదువుగాక అని దిపాంకర్ ను శంపించారు.