యువతి కారు ఆపిన పోలీసులు..రక్తం పూసి రచ్చ రచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

యువతి కారు ఆపిన పోలీసులు..రక్తం పూసి రచ్చ రచ్చ

March 26, 2020

Kolkata Woman Bite Cop   

లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరైనా వాహనాలు వేసుకొని రోడ్లపైకి వస్తే ఆరదండాలు వేయిస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడంలేదు. కొంత మంది అయితే పోలీసులపైకి తిరగబడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి ప్రయాణిస్తున్న కారును పోలీసులు ఆపినందుకు రచ్చ రచ్చ చేసింది. వారిపైకి దూసుకువస్తూ నానా హంగామా సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో పోలీసులు ఆపారు.  తాము మెడిసిన్స్ తీసుకురావడానికి వచ్చామంటూ ఆ యువతి చెప్పింది. ప్రిస్కిప్షన్ చూపించాలని పోలీసులు  అడిగితే తమ వద్ద లేదని సమాధానం ఇచ్చారు. దీంతో వారు బయటకు రావడానికి వీలులేదని తేల్చి చెప్పారు. కోపం పట్టలేకపోయినా ఆ యువతి కారు దిగి వాగ్వాదానికి దిగింది. అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి చేతిని కొరికింది. వెంటనే తనకు ఉన్న పాత గాయాన్ని గోళ్లతో రక్కి ఆ రక్తాన్ని అధికారి డ్రెస్సుకు పూసింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వారినే బెదిరించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో ఓ వ్యక్తి కూడా ఆ యువతి వెంట ఉన్నాడు. వాగ్వాదం తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.