టాస్ గెలిచిన కోల్‌కతా.. ముంబై బోణీ కొట్టేనా? - MicTv.in - Telugu News
mictv telugu

టాస్ గెలిచిన కోల్‌కతా.. ముంబై బోణీ కొట్టేనా?

April 6, 2022

cri

గతకొన్ని రోజుల క్రితం మొదలైన ఐపీఎల్ 15 మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. నువ్వు, నేనా అన్నట్లుగా తలపడతున్నాయి. యువ ఆటగాళ్లు సత్తాను చాటుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కరోనా కారణంగా రెండేళ్లు అభిమానులు లేకుండా జరిగిన ఐపీఎల్..ఈసారి అభిమానుల మధ్య కేరింతల, నినాదాల మధ్య జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో గురువారం పుణె స్టేడియం వేదికగా కోల్‌కతా, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

ఇప్పటికే లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై, ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొడుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కాసేపట్లో కోల్‌కతాతో ముంబై తలపడనుంది. ఈ మేరకు టాస్ నెగ్గిన శ్రేయస్ సేన తొలుత ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. ప్రత్యర్ధి ముంబైకి బ్యాటింగ్‌ను అప్పగించింది.

ముంబై ఇండియన్స్ జట్టులో..
ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి ఉన్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో..
అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.