బరువు తగ్గిస్తామని చుక్కలు చూపించారు.. ‘కలర్స్‌’కు భారీ జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

బరువు తగ్గిస్తామని చుక్కలు చూపించారు.. ‘కలర్స్‌’కు భారీ జరిమానా

May 14, 2022

ఎలాంటి డైట్ పాటించకుండా, సైడ్‌ ఎఫెక్ట్స్ రాకుండా బరువు తగ్గిస్తామంటూ టీవీలో వచ్చిన ప్రకటన చూసి ‘కలర్స్’కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. వెయిట్ లాస్ సంగతేమో కానీ దాని కోసం శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు, అందుకోసం చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వలేదని మియాపూర్‌కు చెందిన సముద్రాల మహేందర్‌ అనే వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై విచారించిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్… ‘కలర్స్‌’ తీరును తప్పు పట్టింది. బాధితుడు చెల్లించిన రూ.28,500, 4 శాతం వడ్డీతో, కేసు ఖర్చులు రూ.3 వేలు, సికింద్రాబాద్‌కు చెందిన బాధితురాలు ఎం.లక్ష్మీరెడ్డికి రూ.23 వేలు, 6 శాతం వడ్డీతో రీఫండ్‌ చేయడంతో పాటు పరిహారం రూ.5 వేలు, కేసు ఖర్చులు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.