కేసీఆర్ గారు..ఒంటరి పురుషుణ్ణి, నాకూ పెన్షన్ ఇవ్వండి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ గారు..ఒంటరి పురుషుణ్ణి, నాకూ పెన్షన్ ఇవ్వండి

November 12, 2019

ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పింఛను ఇస్తున్న సంగతి తెల్సిందే. అయితే తనకూ పింఛన్ ఇవ్వాలని ఓ ఒంటరి పురుషుడు కోరుతున్నాడు. తన భార్య తొమ్మిదేళ్ల కిందటే తనను వదిలేసి పోయిందని.. కూలి పనులు చేసుకొని వృద్ధ తల్లిదండ్రులను పోషిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒంటరి పురుషుడి పింఛన్ కావాలని కోరుతూ గ్రామ సర్పంచికి వినతిపత్రం అందించాడు. కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Komaram bheem.

జిల్లాలోని బూరుగూడకి చెందిన ధరణి తిరుపతి తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య తన నుంచి తొమ్మిదేళ్ల కిందటే విడిపోయింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ కూలి పనులు చేస్తూ వృద్ధ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. తన పేరు మీద భూమి గానీ, ఇతర ఆస్తులు గానీ ఏవీ లేవని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2016 ఆసరా పింఛన్ అందించినట్లే.. ఒంటరి పురుషుడినైన తనకూ పింఛన్ అందించాలని కోరుతున్నాడు.