కొమరంభీంగా గర్జించిన ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కొమరంభీంగా గర్జించిన ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ వీడియో

October 22, 2020

ntr

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. గోండు వీరుడు కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 

ఈరోజు కొమరం భీం జయంతిని పురస్కరించుకుని రామ్ చరణ్ వాయిస్‌తో భీంకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్.. కొమరం భీం పాత్రలో గర్జిస్తున్నాడు. ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ సరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021లో విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల రూపాయలతో రూపొందుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.