టీపీసీసీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతోంది. అందులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ ఆడియోలో కోమటిరెడ్డి రెచ్చిపోయారు. తనను చెరుకు సుధాకర్ తిట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూతులతో విరుచుకుపడ్డారు.”చెప్పు మీ నాన్నకి నన్ను తిట్టడంతో తమ మనుషులు సుధాకర్‌ను చంపేందుకు తిరుగుతున్నారు. వారం రోజుల్లో చంపేస్తారు.జాగ్రత్తగా ఉండమను. నిన్ను కూడా చంపేస్తారు. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు జాగ్రత. నా 25 సంవత్సరాల సర్వీస్‌లో లక్షల మందిని బతికించా..సాయం చేశా. వారందరూ చెరుకు సుధాకర్‌పై కోపంతో ఉన్నారు. దొరికితే చంపేస్తారు. నిన్ను కూడా చంపే అవకాశం ఉంది. నేను ఎంతమందిని ఆపగలను” అంటూ సుధాకర్ కుమారుడు సుహాస్ ను బెదిరించారు. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కోమటిరెడ్డి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో తెలంగాణ ఇంటి పార్టీని చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డితో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిని అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.