Komatireddy Brothers Munugode By Poll TCONG BJP
mictv telugu

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్..?

October 26, 2022

మునుగోడులో మూడో కన్ను తెరుస్తున్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా?అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ ఇవే ప్రయత్నాలు చేస్తున్నాయా?మునుగోడులో అవుననే ప్రచారం జరగుతోంది. ఎన్నికలనాటికి ఏమి జరుగునో ఏమోగానీ…ఇప్పుడైతే ఇంటర్నల్ పాలిటిక్స్ జోరుగా కొనసాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

రణగోడులో హోరాహోరీ

మునుగోడులో హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. మూడుపార్టీలు పోటీపడి ప్రచారం చేస్తున్నాయి. ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. గెలుపుకోసం వున్న అన్ని ఆప్షన్లని వెతుకుతున్నాయి. తీన్మార్ వార్‌లో కాంగ్రెస్ తగ్గేదేలే అంటూ కదులుతోంది. కంచుకోటలో కేడర్‌ని నిలుపుకునేందుకు ట్రై చేస్తోంది.

కాంగ్రెస్ కీలక నిర్ణయం

మునుగోడులో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెంటిమెంట్‌ని రగిలిస్తున్నారు. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఊహించని షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు నిర్ణయించారు. బై పోల్ వార్‌లో కాంగ్రెస్‌ని రెండోస్థానంలో నిలిపేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండాలంటే బీజేపీని గెలవనీయకూడదనే నిర్ణయానికి వచ్చేశారు.ఇందులో భాగంగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.

పార్టీలు వేరైనా…గురి ఒక్కటే..!

అటు పీసీసీ, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ కన్నేశారని జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. వీరికి షాక్ ఇచ్చి తీరాలనే వ్యూహంలోఅటు కాంగ్రెస్ , ఇటు బీజేపీలున్నాయని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మునుగోడుతోనే కాంగ్రెస్ పని అయిపోతుంది. నమ్ముకున్న కేడర్ అంతా పార్టీని వదిలే అవకాశం లేకపోలేదు. అంతేకాదు 2023లో కనీస పోటీని కూడా కాంగ్రెస్ ఇవ్వలేని స్థితిలో వుందని, టీఆర్ఎస్ , బీజేపీ ప్రచారం చేసే అవకాశం వుంది. అందుకే ఈ ఛాన్స్ ఆ రెండుపార్టీలకు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.