కోమటిరెడ్డి సవాల్ స్వీకరిస్తున్నా: వీరేశం - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి సవాల్ స్వీకరిస్తున్నా: వీరేశం

December 11, 2017

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విసిరిన సవాలును టీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వీకరించారు. తాను వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ‘నకిరేకల్‌లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కోమటిరెడ్డి సోదరులు కూడా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలి. సవాల్ అంటే సవాల్ ’ అని అన్నారు. నకిరేకల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వీరేశం ఓడిపోతే అలాగే చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ చేయడం తెలిసిందే.తెలంగాణాలో కాంగ్రెస్ విస్తరిస్తోందని, నకిరేకల్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్‌ వస్తున్నారంటేనే వీరేశం బెంబెలెత్తిపోతాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబం మొత్తం పోరాడినా.. కాంగ్రెస్‌ గెలుపును అడ్డుకోలేరని అన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్‌ మూడో కన్ను తెరిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోతుంది’ అని పేర్కొన్నారు.