సింగరేణిలో స్కాం జరుగుతోంది.. మోదీకి కోమటిరెడ్డి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణిలో స్కాం జరుగుతోంది.. మోదీకి కోమటిరెడ్డి ఫిర్యాదు

March 15, 2022

bcvb

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వార్త రాలేదని, కానీ కుంభకోణం జరిగిన మాట వాస్తవమని ఆధారాలతో సహా ప్రధానికి వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు సమావేశం ముగిసిన సమయంలో ఈ భేటీ జరిగింది. తన నియోజకవర్గంలోని సమస్యలతో పాటు సింగరేణి స్కాం గురించి ప్రధానికి తెలియజేశారు. ఈ మేరకు కోమటిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అనంతరం ప్రధాని ఏం సమాధానమిచ్చారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘నాకంతా తెలుసు. తప్పకుండా తగిన చర్యలు ఉంటాయి’ అని చెప్పినట్టు బదులిచ్చారు.