Komatireddy Rajagopal reddy arrest at munugodu staged dharna protest for shepherds demands
mictv telugu

రాజగోపాల్ రెడ్డి అరెస్ట్.. మునుగోడులో ఉద్రిక్తత

November 14, 2022

Komatireddy Rajagopal reddy arrest at munugodu staged dharna protest for shepherds demands

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ధర్నా చేశారు. రెండు గంటల పాటు రోడ్డుపై భైఠాయించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

గొల్ల, కురుమ కులస్తులకు గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. బీజేపీ కార్యక్తలు, గొల్ల కురమలు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేయకుండా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డు తగలడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోపక్క.. ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చౌటుప్పల్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతో సమస్య మరింత ముదిరింది.