Komatireddy Rajgopal Reddy Respond Election Commission Showcause Notices
mictv telugu

ఆ డబ్బుకి, నాకు ఎలాంటి సంబంధం లేదు: రాజగోపాల్ రెడ్డి

October 31, 2022

మునుగోడు ఉప ఎన్నిక క్లైమాక్స్‌కు చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి కుటుంబీకుల కంపెనీల నుంచి ఓటర్లకు డబ్బులు బదిలీ చేశారంటూ TRS ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్ల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో డబ్బును అకౌంట్లలోకి బదిలీ చేశారని ఆరోపించింది. తక్షణమే బీజేపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈనెల 14, 18, 29 తేదీల్లో సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు చెందిన బ్యాంక్ ఖాతా నుంచి.. 23 ఖాతాలకు నగదు (మొత్తం రూ.5 కోట్ల 24 లక్షలు)బదిలీ జరిగిందని ఫిర్యాదులో తెలిపింది. ఈ ఫిర్యాదుతో ఆ లావాదేవీలపై వివరణ ఇవ్వాలని ఈసీ రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

సుశీ ఇన్‌ఫ్రా అకౌంట్‌ నుంచి బదిలీ అయిన రూ.5 కోట్లకుపైగా నగదు అంశానికి, తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఇప్పటికే..దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. టీఆర్ఎస్‌ ఓడిపోతుందనే ఆ పార్టీ నేతలు పిచ్చి చేష్టలు చేస్తున్నారని..ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటర్లు బొంద పెట్టడం ఖాయమని చెబుతున్నారు.